అక్రమ రవాణా నిరోధక యూనిట్లు ఏర్పాటు పై 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు

పరిచయం:

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా దేశంలో తలెత్తిన ప్రధాన సవాళ్లలో ముక్యంగా బాలల అక్రమ రవాణా స్థాయి పెరగడం. గత ఏడాది మార్చి నుండి ఆగస్టు మధ్య కాలంలో చైల్డ్ హెల్ప్ లైన్‌ కు షుమారు 27 లక్షల కాల్స్ వచ్చాయి. జాతీయ చైల్డ్ హెల్ప్ లైన్‌ ను నిర్వహిస్తున్న అధికారులు లెక్కల ప్రకారం 2019 లో 1.70 లక్షల కేసులు నమోదు అయితే 2020 లో ఈ కొద్దికాలంలోనే 1.92 లక్షల కేసులును గుర్తించడం జరిగింది. (source: Indian Express. ‘Untold story of lockdown: sharp surge in child trafficking’. October 12, 2020). దేశంలో  బాలల అక్రమ రవాణా సమస్య యొక్క తీవ్రతను గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సమస్య పై ఎక్కువ ద్రుష్టి పెట్టాలని అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. అందుకోసం ప్రత్యకంగా కొన్ని  మార్గదర్శకాలను 2020 జూలై మరియు డిసెంబర్ నెలల్లో విడుదల చేసింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు:  దేశంలో పెరుగుతున్న బాలల అక్రమ రవాణాను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యెక మార్గదర్శకాలను జారీ చేసింది.  ఈ విషయం లో అత్యంత ప్రాముఖ్యత నిచ్చి వెంటనే తగిన కార్యక్రమాలు చేపట్టాలని కుడా కేంద్రం కోరింది.  కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలలో కొన్ని ముక్యమైన అంశాలు:-    

 • ప్రతి జిల్లాలో ఒక AHTU యూనిట్ ఏర్పాటు చేయాలి.  ఇప్పటికే లేనిచోట్ల వెంటనే కొత్త AHTU లను ఏర్పాటు చేయడం ఆ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం మరియు అత్యవసర ప్రాతిపదికన వాటి కార్యాచరణను నిర్ధారించడం. 
 •  రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల  విభాగాలతో రాష్ట్ర స్థాయి “సమన్వయ కమిటి” ని ఏర్పాటు చేయడం మరియు ఈ కార్యక్రమాలు ను పర్యవేక్షిస్థూ  ఎప్పటికప్పుడు సమీక్షించడం చేయాలి. 
 • రేడియో, టెలివిజన్, వార్తాపత్రికలు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా వివిధ మార్గాల ద్వారా సమాజంలోని ప్రజల కోసం ప్రత్యెక కార్యక్రమాలు ఏర్పాటు చేసి తప్పిపోయిన పిల్లలు, అక్రమ రవాణా వంటి అంశాలు పై అవగాహన కల్పించడం. బహిరంగ ప్రదేశాల్లో బాలల హెల్ప్ లైన్ నంబర్లను  తెలియజేసే పోస్టర్స్, వాల్ బోర్డు లు ఏర్పాటు చేయాలి .
 •  జిల్లా యంత్రాంగం తప్పిపోయిన పిల్లలు మరియు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమస్యల పైనా పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. 
 •  చట్టాలు అమలు చేసే అధికారులు తమ పరిధిలోని స్థానిక పంచాయతీలు, కమ్యూనిటీ పెద్దలు / నాయకులు, విలేజ్ వాచ్ మరియు వార్డ్ గ్రూప్ సబ్యులు మొదలైన ప్రతినిధులను ఈ కార్యక్రం లో భాగస్వామిగా చేర్చి  ప్రోత్సహించడం. 
 • గ్రామ పంచాయతీలను ప్రోత్సహించడం ద్వార ఆయా గ్రామాల్లో నివసించే వ్యక్తులకు సంబంధించిన రిజిస్టర్ లు రూపొందింఛి వివిధ పనులు కార్మికులు, త్రాఫ్ఫికింగ్, వ్యభిచారం నిమిత్హం తరలించబడే పిల్లల కదలికలను ఎప్పటి కప్పుడు ట్రాక్ చేస్తూ ఉండేలా గ్రామ పంచాయతీలు భాద్యత తీసుకొనేలా చూడాలి. 
 •  గ్రామాలల్లో అక్రమ రవాణా కు పాల్పడే వ్యక్తులు, ముఠాలను గుర్తించడానికి వారి పనితీరు గురించి సమాచారాన్ని సేకరించడానికి వీలుగా గ్రామ స్థాయి ‘నిఘా’ మరియు ‘ఇంటెలిజెన్స్’ విధానాలను ఏర్పాటు చేయడం. 
 •  ఇబ్బందులు మరియు సమస్యల్లో ఉన్న పిల్లలను గుర్తించడం, అలాగే ముక్యంగా ట్రాన్సిట్ పాయింట్లలో (రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు మొదలైనవి) ప్రత్యేక జాగరూకతతో సహా నివారణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం. 
 •  పోలీస్ అధికారులకు అక్రమ రవాణా సమస్య గురించే గాక, ఒంటరిగా ఉన్న పిల్లలను గుర్తించడం, అలాగే అనుమాన స్పదంగా బాలలు తో ఉంటున్న వారిని గుర్తించడం, అలాగే బాలలను ఇంటర్వ్యూ చేసే విధానం ఆ సమయంలో పాటించవలిసిన విధానాలు ఆ సమయంలో పోలీసు అధికారులను సున్నితంగా మార్చడం ఎలా అనే అంశాలు పై పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు ప్రత్యక శిక్షణలు అందించాలి.
 • నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  గత ఏడాది మార్చ్ నెలలో ప్రారంభించిన సిసిటి ఎన్ఎస్ మరియు క్రిమాక్ అప్లికేషన్‌ను వినుయోగించు కొనేలా పోలీసు అధికారులను ప్రోస్తహించాలి. –      నిరాశ్రయులైన మహిళలు మరియు ఆదరణ అవసరం అయిన పిల్లల కోసం ప్రత్యక హాస్టల్ లేదా ఆశ్రయాలు నిరంతరం తెరిచి ఉండేలా చూడటం మరియు వారికి అదనపు సౌకర్యాలు అందుబాటులో ఉంచడం.

అమలు తీరు తెన్నులు:

 • 8 రాష్ట్రాల్లో జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ తో సహా పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో కేంద్ర ప్రబుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అమలు చేయడానికి  పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం చూపడం లేదని తేలింది. దేశంలో ప్రతి జిల్లాలో (జిల్లాకు ఒకేటి వంతున) మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ల ఏర్పాటు చేసి రాష్ట్రాల్లో అక్రమ రవాణాను నిరోధించడానికి వేలుగా రాష్ట్రాలకు, కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది.-      
 •   కోవిడ్ -19 మహమ్మారి యొక్క హాట్‌స్పాట్‌లు గా ఉన్న మహారాష్ట్ర, యుపి మరియు జమ్మూ కాశ్మీర్ లతో సహా ఎనిమిది రాష్ట్రాలు 2020 అక్టోబర్ వరకు మానవ అక్రమరవాణా యూనిట్లను ఏర్పాటు చేయలేదు. కాని వాస్తవం ఏమిటి అంటే, యుపి, మహారాష్ట్ర, మిజోరాం, చత్హేస్ ఘడ్, హర్యానా మరియు నాగాలాండ్ రాష్టాలు అసలు కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజుకు ఒక్క యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయలేదు.
 •  50% జిల్లాల్లో AHTU ఏర్పాటుకు 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన నిబంధనలను  కూడా మహారాష్ట్ర మరియు యుపి పాటించలేదని అధ్యయనాలు వెల్లడించాయి. యుపి మరియు మహారాష్ట్రలలో వరుసగా 35 యూనిట్లు (75 జిల్లాలకు) మరియు 12 యూనిట్లు (36 జిల్లాలకు) మాత్రమే ఉన్నాయి. 

కలకత్తా కు చెందిన సంజోగ్ నేతృత్వంలో 16 రాష్ట్రాలు మరియు యుటిలలో ఇదే విధమైన అధ్యయనం 2010-2019 మధ్య కాలానికి AHTU ల స్థితి పై ఒక సర్వే చేయగా 27% యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయని మరియు 225 AHTU లు కాగితంపై మాత్రమే ఉన్నాయని కనుగొన్నారు. 

గ్యాప్స్  మరియు సవాళ్లు:  MHA మార్గదర్శకాలను అమలు చేయడంలో వివిధ రాష్ట్రాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. భారతదేశంలో మానవ అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం కూడా విఫలమైందని అర్ధం అవుతుంది.  భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకున్నప్పటికీ, ఇంకా వివిధ అంతరాలు మిగిలి ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన సవాళ్లు:

 • రాజకీయ సంకల్పం లేకపోవడం: సమస్య యొక్క పరిమాణంతో పోలిస్తే, భారతదేశంలో మానవ అక్రమ రవాణా సమస్య ఒక రాజకీయ ప్రాధాన్యత అంశంగా కనిపించడం లేదు. మొత్తం మీద అక్రమ రవాణా నిరోధక ప్రయత్నాలు ఒక్క కట్టు బానిసత్వ శ్రమకు వ్యతిరేకంగా చేస్తేనే సరిపోవు. అక్రమ రవాణాదారులపై దర్యాప్తు, ప్రాసిక్యూషన్, కేసు  నేరారోపణలను రుజువు చేసి శిక్షలు వేయడం లో వైఫల్యం వల్ల  అక్రమ రవాణాదారుల (త్రాఫ్ఫికెర్స్ )  నిర్దోషులుగా బయటకు వస్తు ఉన్నారు ఫలితంగా వీరి రేటు 83 శాతానికి పెరిగింది.
 • మార్గదర్శకాల యొక్క సలహా స్వభావం: రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లనే MHA జారీ చేసిన మార్గదర్శకాల అమలు కు రాష్ట్రాలు కట్టుబడి ఉండటం లేదు లేదా వాటిని పాటించడం లేదు.  కేంద్రం నిధులను విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వాలు AHTU ల ఏర్పాటు చేయడం, నిర్వహణ  యొక్క పూర్తి బాధ్యత రాష్ట్రాలదే. ముక్యంగా చాలా రాష్ట్రాలు అక్రమ రవాణా సమస్య ఒక తలబారంగా భావిస్తూ  అసలు పట్టించు కోవడంలేదు అనే అభిప్రాయం కూడా ఉంది. COVID-19 మహమ్మారి కాలంలో ఇది నిజం అని రుజువు అయింది. ఈ కోవిడ్ కాలంలో వివిధ రాష్ట్రాలు లో  యాభై శాతం జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి.
 •  ఇంటర్-డిపార్ట్‌మెంటల్ మరియు ఇంటర్-స్టేట్ కోఆర్డినేషన్ లేకపోవడం: బచ్పాన్ బచావో ఆందోళన్ (ట్రాఫికింగ్‌ను ఎదుర్కోవడం, 2019-2020) నిర్వహించిన అధ్యయనంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో, ఇంటర్-డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ – పోలీసు, న్యాయ శాఖ, హోమ్ శాఖ, మరియు ఇతర  ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కట్టుగా సమన్వయం తో పాల్గొని అక్రమ రవాణా భాదితులను రెస్క్యూ  చేయడం, పునరావాసం, నష్ట పరిహారం అందించడం వంటి అంశాల్లో  బలహీనంగా ఉండి విఫలం చెందినట్లు పేర్కొనడం జరగింది. ఇంకా, శాంతిభద్రతలు రాష్ట్ర విషయంగా ఉండటం వల్ల  అంతర్గత భద్రత పై అంతర్-రాష్ట్ర మండలి లేకపోవడంతో, వివిధ రాష్ట్రాల్లో అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని కేసులలో AHTU లు పాల్గొనడం లేదు, ఫలితంగా నేరస్తులను అదుపులోకి తీసుకోవడం త్వరితిగాటిన కేసు విచారణ కు అంతర్-రాష్ట్ర సమన్వయాన్ని కష్టతరం చేస్తుంది.
 • పర్యవేక్షణ మరియు జవాబుదారీతనం కొరత: AHTU లు  ఏర్పాటు చేయబడటమే కాకుండా వాటి లక్ష్యాలను సాధించడానికి వీలుగా రోపొందించిన కార్యాచరణ అమలుకు తగిన మానవ మరియు ఆర్థిక వనరులు ఉన్నాయని ఉన్నాయని నిర్ధారించడానికి ప్రస్తుతం సరైన యంత్రాంగాలు లేవు. రాష్టాలు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవటానికి వీలుగా AHTUలను మానిటరింగ్ చేసే ప్రత్యెక యంత్రాంగం లేనప్పుడు MHA జారీ చేసిన మార్గదర్శకాలు అమలు నోచుకోవడం జరగని పని అని చెప్పవచ్చు. 

AHTU పటిష్టత కు సూచనలు: ·

 • ప్రస్తుతమున్న AHTU ల యొక్క పని తీరు పరిశీలించడానికి నోడల్ సంస్థలు అయిన  MHA మరియు రాష్ట్ర హోం శాఖ క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ రివ్యూలు నిర్వహించాలి. 
 • అన్ని జిల్లాల్లో AHTU ల ఏర్పాటు మరియు రాష్ట్ర సమ్మతిని నిర్ధారించడానికి ప్రణాళిక రూపొందించి టైం లైన్ ప్రకారం  ఏర్పాటు చేయడం.
 • AHTU ల పనితీరు పరిశీలించడానికి ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో పర్యవేక్షణ మరియు మూల్యాంకన విభాగాలను ఏర్పాటు చేయడం.
 • భాదితుల యొక్క మానవ హక్కుల ను కాపాడుతూ బాధితుల కేంద్రీకృత విధానాన్ని అనుసరింఛి వారికి అన్ని విధాలుగా ఆదుకోవాలి. 
 • దేశంలో ప్రబలంగా ఉన్న అక్రమ రవాణా యొక్క వివిధ స్వభావాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన ఇంటర్-డిపార్ట్‌మెంటల్ మరియు ఇంటర్-స్టేట్ కోఆర్డినేషన్‌ను ప్రారంభించడానికి ఒక SoP ని అభివృద్ధి చేయడం.